- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:‘తల్లికి వందనం’ పథకం పై పత్రికలవి అసత్య ప్రచారాలు: మంత్రి లోకేష్
by Jakkula.Mamatha |
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్నాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్నాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై, రాష్ట్రాభివృద్ది పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని కూటమి మంత్రివర్గం తెలిపింది. ఈక్రమంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ అన్నారు. అసెంబ్లీలో విద్యాశాఖ పై మంత్రి లోకేష్ మాట్లాడుతూ..కేజీబీవీ వంటి రెసిడెన్షియల్ స్కూళ్లను బలపర్చుతామని పేర్కొన్నారు. అలాగే విద్యాకానుకను కొనసాగిస్తామని వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము ఆ పథకానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Next Story






