కాళ్లు, చేతులు నరికేస్తా: వైసీపీ నేతలకు కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-13 18:19:34  IST  )

వైసీపీ నేతలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

కాళ్లు, చేతులు నరికేస్తా: వైసీపీ నేతలకు కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి నేతలను నరుకుతానంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Former Minister Karumuru Nageswara Rao) ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు(Guntur) ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతానని, గుంటూరు అవతలి వాళ్లను సరికిపారేస్తామంటూ కారుమూరి హెచ్చరించారు. అయితే కారుమూరి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌(Guntur Nagarampalem Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే కారుమూరి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Union Minister Bhupathi Raju Srinivasa Varma) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకొల్లులో కూటమి నేతలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కారుమూరికి దీటుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతల జోలికొస్తే కాళ్లు, చేతులు నరికేస్తానని హెచ్చరించారు. అవినీతి కేసులో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. టీడీఆర్ కుంభకోణంలో కారుమూరి చిప్పకూడు తినడం ఖాయమని వ్యాఖ్యానించారు. వైసీపీ మందను ప్రజలు ఇంటికి తోలేశారని, అయినా బుద్ధి రాలేదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విమర్శించారు.

Next Story