- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ ఇళ్ల ముందు అలా చేస్తే ఊరుకుంటారా..: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సాధువుల ఆగ్రహం
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సాధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఓవైపు తిరుమల(Tirupati)ను సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రక్షాళన చేస్తున్నామని చెబుతున్నారని, మరోవైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన ధర్మాన్ని కాపాడేందుకు బోర్డు ఏర్పాటు చేయాలని అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సాధువులు తప్పుబడుతున్నారు. అలిపిరి(Alipiri) శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్(Mumtaz Hotel) నిర్మించడంపై సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆమరణ దీక్షకు దిగారు. హోటల్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమల ప్రక్షాళన, సనాతన ధర్మం రక్షణపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇతర మతాలకు చెందిన స్థలాల్లో హిందువులు గుడులు కడితే ఒప్పుకుంటారా అని సాధువులు ప్రశ్నించారు.
తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మించొద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వంలోనూ హిందువులకు అన్యాయం జరుగుతోందన్నారు. సనాతన ధర్మంపై పవన్ మాట్లాడితే ఏంతో సంతోషించామని చెప్పారు. ఆయన చేస్తున్న పనికి తాము కూడా మద్దతిస్తామన్నారు. ఏడు కొండల చుట్టూ దైవకార్యాలు జరిగాలి కానీ, ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు, హోటలు పెడితే ఎలా అని సాధువులు ప్రశ్నించారు. ఇలా తమ ఇంటి ఎదుట పెడితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాలు ఒప్పుకుంటారా అని నిలదీశారు. టూరిజాన్ని డెవలప్ మెంట్ చేయాలని, కానీ తిరుమల పవివత్రకు భంగం కలిగించొద్దన్నారు. అలిపిరిలో కాకుండా తిరుపతిలో ఇతర ప్రాంతాల్లో ముంతాజ్ హోటల్ నిర్మించుకోవాలని సూచించారు. ఇప్పుడు ముంతాజ్ పేరుతో హోటల్ పేడితే భవిష్యత్తులో ఔరంగజేబు, షాజహాన్, స్టీఫెన్ పేరుతో మరిన్ని కడతారని సాధువులు వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడటం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ చేసే ప్రతి మంచి పనులకు తమ ఆశీస్సులుంటాయన్నారు. తిరుపతిలో అన్యాయం జరుగుతోందని, ఇప్పటికైనా ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని సాధువులు డిమాండ్ చేశారు.






