- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ వెధవన్నర వెధవ.. కేంద్ర మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former AP Chief Minister Jagan Mohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి(Renuka Chowdhury) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి(Amaravati)పై సాక్షి టీవీ(Sakhi Tv) డిబేట్‌లో విషం చిమ్మడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వెధవన్నర వెధవ అంటూ మండిపడ్డారు. జగన్ పుట్టగానే విజయమ్మ గొంతు పిసికి చంపాల్సిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తొలి నుంచి అమరావతికి వ్యతిరేకి అని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో ఆడిన డ్రామాలు అందరికి తెలుసున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి అప్పట్లో తాను కూడా మద్దతు తెలిపానని ఆమె చెప్పారు. జగన్‌కు అధికారం పోయినా కూడా అమరావతిపై ఉన్న కక్ష అలాగే కొనసాగుతోందని ఆరోపించారు. సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలను కించపర్చిన జర్నలిస్టు శ్రీనివాస్, కృష్ణంరాజును అసలు వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.






