ఎమ్మెల్యేపై వ్యాఖ్యల కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-25 05:44:43  IST  )

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఎమ్మెల్యేపై వ్యాఖ్యల కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉన్న టీమ్ ప్రసన్నకుమార్ రెడ్డిని విచారించనుంది. తొలుత కోవూరు పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పిన పోలీసులు.. చివరి నిమిషంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేపై వ్యాఖ్యల విషయంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.

Next Story