పవన్ ఫ్లెక్సీలు, పోస్టర్లు చించివేత.. గుంటూరు ఫ్యాన్స్ గరం..గరం..

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-01-04 11:19:55  IST  )

గుంటూరులో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు...

పవన్ ఫ్లెక్సీలు, పోస్టర్లు చించివేత.. గుంటూరు ఫ్యాన్స్ గరం..గరం..
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. న్యూఇయర్, సంక్రాంతి సందర్భగా విషెస్ చెబుతూ పాత బాలాజీ నగర్‌లో పలు చోట్ల పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లను కొందరు రాత్రి రాత్రికి చించివేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత, అభిమాన హీరో ఫ్లెక్సీలను చించి వేసిన వారిని పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


మరోవైపు పవన్ ఫ్లెక్సీలు చించివేతపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆకతాయిల పనో.. మతి స్థిమితంలేని వాళ్లో పవన్ ఫ్లెక్సీలను చించి వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా తమ అభిమాన నేత ఫ్లెక్సీలను చించివేసి ఉంటారని జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు.

Next Story