సమ్మె విరమించిన స్పెషాలిటీ ఆస్పత్రులు.. పునఃప్రారంభం కానున్న ఎన్టీఆర్ వైద్యసేవ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-07 06:56:59  IST  )

ఏపీలో వారంరోజుల క్రితం నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నేటి నుంచి పునః ప్రారంభం కానుంది.

సమ్మె విరమించిన స్పెషాలిటీ ఆస్పత్రులు.. పునఃప్రారంభం కానున్న ఎన్టీఆర్ వైద్యసేవ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్ వర్క్ ఆస్పత్రులు వారంరోజుల క్రితం చేపట్టిన సమ్మె నేటితో ముగిసింది. పథకం కింద వైద్యం చేయగా.. వాటి బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. తాజాగా ప్రభుత్వం అసోసియేషన్ తో చర్చించి.. 10 రోజుల్లో రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో.. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది. పదిరోజుల్లోగా బకాయిలు చెల్లించని నేపథ్యంలో.. మళ్లీ ఎన్టీఆర్ వైద్య సేవల్ని నిలిపివేస్తామని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశారు. సమ్మె విరమణతో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద చేసే అన్నిరకాల వైద్యసేవలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా.. ప్రభుత్వంతో చర్చలు జరిపిన మినిట్స్ కూడా ప్రభుత్వ అధికారులు అసోసియేషన్ కు పంపినట్లు తెలుస్తోంది. అందులో ఇచ్చిన హామీలు, చర్చల వివరాలు కూడా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story