- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రిస్వామి విచారణ పూర్తి.. కావేరి బస్సు దగ్ధంపై పోలీసుల కీలక ప్రకటన
కావేరి బస్సు దగ్ధంపై కర్నూలు పోలీసులు కీలక ప్రకటన చేశారు..

దిశ,వెబ్ డెస్క్: కావేరి బస్సు దగ్ధం(Kavari Bus Fire) ఘటనలో విచారణ చేపట్టిన కర్నూలు పోలీసులు(Kurnool Police) బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఈ మేరకు బస్సు ప్రమాదంపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు వివరించారు.
‘‘బస్సు దుర్ఘటనకు ముందే శివశంకర్, ఎర్రిస్వామి లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరారు. తుగ్గలిలో ఎర్రిస్వామిని దించేందుకు శివశంకర్ బైక్‌పై బయల్దేరారు. మధ్యలో కియా షోరూం వద్ద పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. 2.24 గంటలకు పెట్రోల్ కొట్టించారు. అనంతరం శివశంకర్ బైక్ నడిపారు. బైక్ స్కిడ్ అయి కుడిపక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో శివశంకర్ స్పాట్‌లోనే మృతి చెందారు. ప్రమాద సమయంలో వెనుక ఉన్న ఎర్రిస్వామి కిందపడటంతో స్వల్పంగా గాయాలయ్యాయి. శివశంకర్‌ను, రోడ్డు మధ్యలో ఉన్న బైక్‌ను ఎర్రిస్వామి పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఈలోపు బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో మంటలు చెలరేగి దుర్ఘటన జరిగింది. బస్సు, బైక్ ప్రమాదాలపై కేసు నమోదు చేశాం. ఎర్రిస్వామిని పలు కోణాల్లో విచారించాం.’’ అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.






