మహాసంద్రంలా అమరావతి పునర్ నిర్మాణ సభ : కన్నా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-03 06:53:51  IST  )

ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) రాక.. రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందుతున్న నమ్మకానికి మరింత బలం చేకూర్చిందని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.

మహాసంద్రంలా అమరావతి పునర్ నిర్మాణ సభ : కన్నా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో (Amaravati) శుక్రవారం నిర్వహించిన అమరావతి పునర్నిర్మాణ సభ మహాసంద్రాన్ని తలపించిందని బీజేపీ (BJP) నేత కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) రాక.. రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందుతున్న నమ్మకానికి మరింత బలం చేకూర్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ (YS Jagan) అమరావతిని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. గతపాలకుల ఆగడాల నుంచి బయటపడేందుకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టారని, కూటమి రాకతో అమరావతి ఊపిరి పోసుకుందని తెలిపారు.

కాగా.. అమరావతిని ప్రపంచస్థాయి రాజధాని నగరంగా నిర్మిస్తామని శుక్రవారం జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

Next Story