- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐ నాగరాజును నిర్దోషిగా ప్రకటించాలి: కృష్ణలంక ప్రజల భారీ ర్యాలీ
విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుకు మద్దతు పెరుగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక(Vijayawada Krishnalanka)కు చెందిన రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్(Rowdy-sheeter Saikrishna missing) మిస్టరీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక సీఐ నాగరాజు(CI Nagaraju)ను సస్పెండ్ చేశారు. కానీ ఆయనకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది.
CIకు మద్దతుగా ర్యాలీ
తాజాగా CI నాగరాజుకు మద్దతు తెలుపుతూ విజయవాడ కృష్ణలంక ప్రజలు ర్యాలీ నిర్వహించారు. సీఐ నాగరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను, నమోదు చేసిన కేసులను తీవ్రంగా ఖండించారు. 3 ఏళ్లుగా కరకట్ట నుంచి భూపతి శివనగర్ వరకు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల గుండెల్లో సీఐ నిద్రపోయారని తెలిపారు. యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా నిరంతరం సేవ చేసే వ్యక్తి సీఐ నాగరాజు అని పేర్కొన్నారు. ఇలాంటి నిజాయితీ గల అధికారులపై కేసులు పెడితే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని, సామాన్యులు బతకలేరన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు అధికారిని తక్షణమే నిర్దోషిగా ప్రకటించి, తగిన న్యాయం చేయాలని కృష్ణలంక స్థానికులు డిమాండ్ చేశారు.






