- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మకం పోయింది... అందుకే హననం చేస్తున్నారు: అంబటి రాంబాబు
వైసీపీది గొడ్డలి పార్టీ అని, మాజీ సీఎం వైఎస్ జగన్‌వి హత్య రాజకీయాలంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp)ది గొడ్డలి పార్టీ అని, మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Ys Jagan)వి హత్య రాజకీయాలంటూ టీడీపీ(Tdp) నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్‌పై మాట్లాడే నైతిక హక్కు లోకేశ్‌కు లేదన్నారు. రెండేళ్లు అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు మళ్లీ గెలుస్తామన్న నమ్మకంలేదన్నారు. అందుకే జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రూ. 3.4 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారని మాజీ అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని వ్యాఖ్యానించారు. మొక్కజోన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోదాములపై దాడులు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసరాలు పెంచారని, రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దోచుకు తింటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.






