- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చేసిన సర్జరీ ఇదే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సర్జరీ జరిగిందని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శనివారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని, సెలబ్రిటీలు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలతో పాటు.. ప్రధాని మోదీ కూడా ఆకాంక్షించారు. పర్సనల్ గా కాల్ చేసి ఆయన ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. దీంతో.. అభిమానులు, రాష్ట్ర ప్రజల్లో పవన్ కల్యాణ్ కు అసలు ఏం సర్జరీ చేశారన్న ఆందోళన మొదలైంది. MRI స్కానింగ్ తీసిన వైద్యులు ఆయనకు సర్జరీ చేయాలని చెప్పారని, ఈ మేరకు సర్జరీ జరిగిందని నిన్నటి నుంచి వార్తలొస్తున్నాయి కానీ.. ఏం సర్జరీ జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ ముక్కుకు సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. శనివారం ఆయనకు డాక్టర్లు (సైనసైటిస్ సమస్య కారణంగా ముక్కుకు సర్జరీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని పలువురు ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలు ఆలయాల్లో తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసైనికులు ప్రత్యేక పూజలు చేయించారు.






