- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్‌పై ప్రజల్లో గందరగోళం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
గ్యాస్ కొరతతో ఏజెన్సీల వద్దకు సిలిండర్లతో వినియోగదారులు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెగ ఏపీకి తగిలింది. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులతో రద్దీగా మారాయి...

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్(Gas) కొరతతో ఏజెన్సీల వద్దకు సిలిండర్ల(Cylinders)తో వినియోగదారులు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెగ ఏపీ(Ap)కి తగిలింది. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు(Gas Agencies) వినియోగదారులతో రద్దీగా మారాయి. ఖాళీ సిలిండర్లు తీసుకొచ్చి ఫుల్ గ్యాస్ ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. స్టాక్ ఉన్న చోట్ల వెంటనే గ్యాస్ ఇస్తున్నారు. కొన్నిచోట్ల గంటల తరబడి నిలబడిగా సిలిండర్లు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై సమీక్ష
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం 17,209 టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉన్నట్లు సీఎంకు తెలిపారు. 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని పేర్కొన్నారు. అయితే సిలిండర్ల బ్లాక్‌మార్కెట్‌పై సీఎం ఆరా తీశారు. డెలివరీ సమయంలో దుర్వినియోడానికి పాల్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరా ఆరా
అలాగే రాష్ట్రంలో పేదల కోసం కొనసాగుతున్న అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాపైనా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గ్యాస్‌పై ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. సాధారణ పరిస్థితి మాదిరిగానే సిలిండర్ సరఫరా జరగాలని చెప్పారు. ఎల్పీజీ సరఫరా, నిల్వలు, బుకింగ్‌పై నిఘా పెట్టాల్నారు. ఆస్పత్రులు, పాఠశాలు, ఆలయాలకు గ్యాస్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఎల్పీజీ వినియోగాన్ని తగ్గించుకునేలా హోటల్ యజమానులు, సంఘాలతో చర్చించాలన్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకకు మరిన్ని గ్యాస్ కేటాయింపులు జరపనున్నట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. అయితే పైప్‌లైన్, ఇండక్షన్ స్టవ్స్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.






