సీఎం చొరవతో ఆర్డీటీకి మోక్షం: పేదలకు నిరాటంకంగా సేవలు : మాంచో ఫెర్రర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-25 04:23:45  IST  )

సీఎం చంద్రబాబు చొరవతో ఆర్డీటీ సేవలు పునరుద్ధరించడంతో సంస్థ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం చొరవతో ఆర్డీటీకి మోక్షం: పేదలకు నిరాటంకంగా సేవలు : మాంచో ఫెర్రర్
X

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాలుగా అనంతపురం వేదికగా నిరుపేదలకు అండగా నిలుస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కి ఎదురైన నిధుల అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనల వల్ల నిలిచిపోయిన నిధులను పునరుద్ధరించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంగళవారం ముఖ్యమంత్రిని తన క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు నిలిచిపోవడంతో సేవా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు, స్వయంగా ఈ సమస్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపి, ఆర్డీటీ చేస్తున్న నిస్వార్థ సేవలను వివరించారు. ముఖ్యమంత్రి నిరంతర కృషి ఫలితంగా కేంద్రం నుంచి తాజాగా క్లియరెన్స్ లభించింది. దీంతో ఆర్డీటీకి విదేశీ నిధుల రాకకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

సీఎం భరోసా

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆర్డీటీ వంటి సేవా సంస్థల వల్ల వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలకు ఎప్పటిలాగే విద్య, వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఆర్డీటీకి లైన్ క్లియర్.. మంత్రి నారా లోకేష్ కు మాంచో ఫెర్రర్ కృతజ్ఞతలు

Next Story