సీఎం ఫుల్ బిజీ.. ఒకే రోజు రెండు చోట్ల పర్యటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-23 14:10:32  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఫుల్ బిజీ కానున్నారు..

సీఎం ఫుల్ బిజీ.. ఒకే రోజు రెండు చోట్ల పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) బుధవారం ఫుల్ బిజీ కానున్నారు. ఈ ఒక్క రోజే రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో పర్యటించనున్నారు. ఈ మేరకు అమరావతి(Amaravati) నుంచి మధ్యాహ్నం 12 తర్వాత ఉండవల్లి(Undavalli) నుంచి హెలికాప్టర్‌(Helicopter)లో బయల్దేరి పాలకొల్లు(Palakollu)కు చేరుకుంటారు. మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం తిరుమలకు వెళతారు. శ్రీవారిని దర్శించుకుంటారు. గురువారం తిరుమలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి అదే రోజు ఉండవల్లికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.

Next Story