పోలీసులు అందుబాటులోకి రాలేదు.. అందువల్లే.. : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-01 10:17:21  IST  )

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

పోలీసులు అందుబాటులోకి రాలేదు.. అందువల్లే.. : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి(Kasibugga Venkateswaraswamy) ఆలయం వద్ద తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. 10 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి అప్పలరాజు(Former Minister Appalaraju) పరిశీలించారు. పోలీసులు అందుబాటులో లేకపోవడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారని తెలిపారు. తన ఇంటికి కొద్దిపాటి దూరంలోనే ఘటన జరిగిందని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన తర్వాత వైసీపీ(Ycp) కౌన్సిలర్‌తో పాటు కొంతమంది మీడియావాళ్లు స్థానిక ఎస్సైకి సమాచారం అందించారని తెలిపారు. భక్తులు చాలా మంది వచ్చారని, కంట్రోల్ చేయలని చెప్పినట్లు ఎవరూ స్పందించలేదని అప్పలరాజు పేర్కొన్నారు.

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం 10 నుంచి 15 వేల మంది భక్తులు వస్తుంటారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఈ విషయం పోలీసుల నోటీసుల్లో ఉన్నదేనని ఆయన తెలిపారు. ఏకదశి సందర్భంగా దాదాపు లక్ష వరకు భక్తులు తరలిరావడం జరిగిందన్నారు. కానీ ఆలయం వద్ద ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ, ముందస్తు ఏర్పాట్లు, భక్తులకు అవగాహనలాంటివి చేయలేదని చెప్పారు. ప్రభుత్వం, గుడి నిర్వాహకులు, పోలీసులు గాని ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. పలాస చరిత్రలో అతి పెద్ద విషాదమని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శించారు. పోలీసులు రకరకాల కారణాల వల్ల పని చేయడం లేదన్నారు. పలాస ప్రాంతంలో శాంతి భద్రతలను పట్టించుకోలేదని చెప్పారు. వైసీపీకి చెందిన యువకులే బాధితులకు సాయం చేశారన్నారు. కాశీబుగ్గ ఘటనకు ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు.

Next Story