- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అగ్ని ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందగా 41 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే మరో ప్రమాదం ఆందోళనకు గురి చేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా కేబుల్స్ నుంచి మంటలు ఎగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






