నేడు ఏపీ కేబినెట్ సమావేశం

by Thanuru Gopichand |

నేడు పెనుమాకలోని ఏపీ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది.

నేడు ఏపీ కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు పెనుమాకలోని ఏపీ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ హాజరు కానున్నారు. సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. వివిధ అంశాలపై కేబినెట్ మంత్రులతో చర్చించి వారికి మార్గదర్శనం చేయనున్నారు. అంతేకాకుండా వివిధ శాఖల్లో జరుగుతున్న పనులు, వాటి ప్రస్తుత పరిస్థితితో పాటు తీసుకోవాల్సిన చర్యల పై సమీక్షించనున్నారు. అనంతరం కేబినెట్ మంత్రులు శాఖల వారీగా చేయవలసిన పనులను గురించి సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. పలు కీలక అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అందులో అమరావతి అనుబంధ అంశాలు కూడా చర్చకు రానుందని సమాచారం.

ప్రధానంగా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో అభివృద్ధి పనులతో పాటు వాటికి కేటాయించాల్సిన భూముల విషయమై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా అమరావతిలో చేపట్టనున్న లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లను పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే లోక్ భవన్ నిర్మానానికి రూ.169 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎస్ఐపీబీలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. జ్యుడీషియల్ అకాడమీ అంశంపై కూడా చర్చించి దానికి పరిపాలన అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీఆర్డీఏ వార్షిక్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వాటి నాణ్యత పరిశీలన.. నిర్మాణ విషయంలో సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించనుంది. అదే విధంగా నాబార్డు నుంచి రుణం పొందేందుకు సీఆర్డీఏకు అనుమతిని ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

Next Story