- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనకాపల్లి | శారదానదిలో విద్యార్థి గల్లంతు
బొజ్జన్నకొండకు విహారానికి వెళ్లిన విద్యార్థుల్లో ఓ విద్యార్థి నదిలో గల్లంతైన సంఘటన వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్ : బొజ్జన్నకొండకు విహారానికి వెళ్లిన విద్యార్థుల్లో ఓ విద్యార్థి నదిలో గల్లంతైన సంఘటన వెలుగు చూసింది. 8 మంది విద్యార్థులు బొజ్జన్నకొండకు విహారానికి వెళ్లారు. సమీపంలోనే ఉన్న శారదానదిలోకి స్నానాల కోసం దిగారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థిని సాయి తనూజ్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహకారంతో సాయి తనూజ్ కోసం గాలింపును కొనసాగిస్తున్నారు.
అయితే నిన్న మన్యం జిల్లాలోని జంఝావతి రిజర్వాయర్లో నిన్న గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృత దేహాలు లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, జీనవాడులోని రైవాడ జలాశయంలో పడవ ప్రమాదంలో గల్లంతైన నలుగురు యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకరి మృతదేహం వెలికి తీయగా మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపును కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రసాద్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు.
విశాఖ బీచ్ లో శనివారం ఆదిత్య, తేజేష్ అనే యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఆదిత్య మృతదేహం ఉడా పార్క్ బీచ్ లో ఈరోజు కనిపించింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నీటి ప్రమాదాలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జలాశయాలు, సముద్ర తీరాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే వినతులు ప్రజల నుంచి వస్తున్నాయి.






