Nara Lokesh: వారి కళ్లలో ఆనందం... వర్ణించలేను

by Thanuru Gopichand |

మంగళగిరి నియోజవర్గంలో పేదలకు ఈ రోజు మంత్రి నారా లోకేశ్​ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

Nara Lokesh: వారి కళ్లలో ఆనందం... వర్ణించలేను
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : మంగళగిరి నియోజవర్గంలో (Mangalagiri) పేదలకు ఈ రోజు మంత్రి నారా లోకేశ్​ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఒక ట్వీట్​చేశారు.. ‘ఉండవల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు మొదటి పట్టా అందజేశాను. రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మి అనే దంపతులు ఇద్దరు బిడ్డలతో ఉండవల్లిలో నివాసం ఉంటున్నారు. ఏళ్ల క్రితం ఉండవల్లి అమరారెడ్డి నగర్ లోని కొండ పోరంబోకు స్థలంలో వారు చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. రజక కులానికి చెందిన గోవిందు డ్రైవర్ గా పనిచేస్తుండగా, భార్య సీతామహాలక్ష్మి బట్టలు ఉతకడం, ఇస్త్రీ పనిచేసి బిడ్డలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాము ఉంటున్న స్థలానికి పట్టా ఇప్పించాలని గతంలో వారు ఎందరో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లోనే దశాబ్దాల సమస్యను పరిష్కరించాం. ఇచ్చిన హామీ మేరకు నేరుగా వారి ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేసాను..’ అని ఆయన వివరించారు. ఇంటి పట్టా అందుకున్న కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం మాటల్లో వివరించలేను ఆయన పేర్కొన్నారు.

Next Story