జనసేన ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త మలుపు.. మరో సంచలన వీడియో వెలుగులోకి!

by Ramesh Naini |

జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వస్తున్న ఆరోపణల పరంపరలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.

జనసేన ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త మలుపు.. మరో సంచలన వీడియో వెలుగులోకి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వస్తున్న ఆరోపణల పరంపరలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో చిక్కుల్లో ఉన్న ఆయనకు సంబంధించి, ఆ మహిళా ఉద్యోగి కోసం ఆయన తన చేయి కోసుకున్నడంటూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ప్రకారం.. సదరు మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే శ్రీధర్ వీడియో కాల్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఆమెతో చాటింగ్ చేస్తూ, తన ప్రేమను గుర్తించాలని కోరుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తన ప్రేమను నిరూపించుకునే ప్రయత్నంలో బ్లేడుతో చేయి కోసుకుని రక్తం చిందుతుండగా ఆమెకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాల్‌లోనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.

ముదురుతున్న వివాదం..

గతంలో తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డారని, ఐదుసార్లు అబార్షన్లు చేయించారని సంచలన ఆరోపణలు చేసిన వీణ అనే మహిళే ఈ వీడియోను కూడా మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే వీడియో కాల్స్‌కు సంబంధించిన క్లిప్పింగులు బయటకు రావడంతో ఇరకాటంలో ఉన్న ఎమ్మెల్యేకు, ఈ తాజా వీడియో మరింత తలనొప్పిగా మారింది. బాధితురాలు వీణ చేస్తున్న ఆరోపణలతో రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా, ఇవి డీప్ ఫేక్ వీడియోలు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఖండించిన విషయం తెలిసిందే. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎమ్మెల్యే తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Next Story