ఏపీపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్‌లకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటిస్తూ ఈ షెడ్యూల్‌ను APPSC కమిషన్ జారీ చేసింది. ఈ పరీక్షలు జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ఈ తేదీలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

ముఖ్యంగా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను విశాఖ, తూ.గో (తూర్పు గోదావరి), ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు తమ పరీక్షల తేదీలు, కేంద్రాల వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.

Next Story