ఏపీలో కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్..ఇక‌పై రోజుకు 5 గంటలే !

by velandi.Saikiran |

ఏపీలో ఉన్న కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్ అమలు చేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది.

ఏపీలో కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్..ఇక‌పై రోజుకు 5 గంటలే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ మ‌రో కీల‌క అడుగు వేసింది. ఏపీలో ఉన్న కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్ అమలు చేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇకపైన రోజుకు ఐదు గంటలు మాత్రమే కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఉండేలా కొత్త రూల్స్‌ తీసుకువచ్చింది. ఈ మేరకు కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపైన కోచింగ్ నిర్వహించాలనుకునే సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. ప్రతి రోజు 50 మందికి పైగా విద్యార్థులు ఉండే కోచింగ్ సంస్థలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ప్ర‌తి ఆదివారం ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని వెల్లడించింది.

ప్రతి రోజు ఐదు గంటలు మాత్రమే కోచింగ్ సెంటర్లు నడపాలని ఆదేశాలు ఇచ్చింది విద్యాశాఖ. అన్ని మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది. ఇంటర్నల్ గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఫీజుల కోసం అస్సలు వేధించకూడదని తెలియజేసింది. భవనం రూల్స్ కు అనుగుణంగా మాత్రమే ఉండాలని... విద్యాశాఖ కఠినమైన రూల్స్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇక పైన పేర్కొన్న వాటిలో ఏమైనా ఉల్లంఘిస్తే క‌చ్చితంగా లక్ష రూపాయల వరకు ఫైన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా తప్పిదాలు రిపీట్ చేస్తే సదరు సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని వార్నింగ్ ఇచ్చింది విద్యాశాఖ‌.

Next Story