- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో డయేరియా కలకలం...న్యూ రాజరాజేశ్వరిపేటలో 300 దాటిన కేసులు
ఏపీలో డయేరియా కలకలం రేపుతోంది. విజయవాడ న్యూ రాజరాజ్వేశ్వరి పేటలో డయేరియా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య 300 దాటినట్లు సమాచారం అందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో డయేరియా కలకలం రేపుతోంది. విజయవాడ న్యూ రాజరాజ్వేశ్వరి పేటలో డయేరియా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య 300 దాటినట్లు సమాచారం అందుతోంది. కాగా నిన్నరాత్రి మరో 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. బాధితుల్లో విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 145 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు అధికారులు కులాయిల నీటి సరఫరా నిలిపివేసి 15 ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నారు. డయేరియా కేసులు పెరగటంపై జిల్లా కలెక్టర్ లక్ష్మిశ స్పందించారు. డయేరియాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికీ హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454కు కాల్ చేయాలన్నారు.






