‘ఆంధ్రా సీఎంగా పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎంగా లోకేష్’

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆంధ్రా సీఎంగా పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎంగా లోకేష్’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్‌(Nara Lokesh)ను డిప్యూటీ సీఎం చేయాలని సూచించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. నితీష్ కుమారుడ్ని బిహార్ ఉప ముఖ్యమంత్రి చేశారు. సేమ్ ఇలాగే.. ఆంధ్రాలో కూడా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. సీఎంగా పవన్, డిప్యూటీ సీఎంగా లోకేష్‌ను చేయాలని అన్నారు. కాపులకు సీఎం పదవి కావాలని.. ఇది వారి ఎన్నో ఏళ్ల కోరిక అని గుర్తుచేశారు. ఆంధ్రా రాజకీయాల్లో కాపు సామాజికవర్గం చాలా బలమైనదని అన్నారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఎంతో త్యాగం చేశారు. సీట్లు తక్కువ తీసుకున్నారు. మూడే మంత్రి పదవులు తీసుకున్నారు. జగన్‌ను గద్దె దింపేందుకు పవన్ కల్యాణ్.. తనను తాను తగ్గించుకొని చంద్రబాబును అందలం ఎక్కించారని తోట త్రిమూర్తులు చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్‌ను కాదని.. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.




Next Story