- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP New Passbooks : ఏప్రిల్ 1 నుంచి ఏపీలో కొత్త పాస్ పుస్తకాలు
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్(AP) రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాల(New passbooks)ను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ(Distribution) చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్(AP) రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాల(New passbooks)ను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ(Distribution) చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు తొలగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పాస్ పుస్తకాలను ఉచితంగానే రైతులకు అందించనున్నారు. భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకొని, వాటిస్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను ఇవ్వనుంది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియను రెవెన్యూ మంత్రి(Revenue Minister) అనగాని సత్యప్రసాద్(Satya Prasad) సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు నివేదించారు. పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలు ఉండటంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం కేంద్రం పరిశీలనలో ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా వెల్లడించారు. కేంద్రం ఆ చట్టాన్ని త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని, ఇప్పటికే సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు ఇచ్చారని సిసోడియా వివరించారు.






