- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మళ్లీ విశాఖ వస్తామని అనుకోలేదు’.. నేపాల్ నుంచి తిరిగివచ్చిన యాత్రికులు
by Gantepaka Srikanth |
నేపాల్(Nepal)లో చిక్కుకున్న తెలుగు యాత్రకులు(Telugu Pilgrims) సురక్షితంగా తిరిగి వచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేపాల్(Nepal)లో చిక్కుకున్న తెలుగు యాత్రకులు(Telugu Pilgrims) సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేపాల్‌లో మేం ఉంటున్న హోటల్‌కి నిప్పుపెట్టారు. మా లగేజ్ అంతా హోటల్‌లోనే ఉంది. కట్టుబట్టలతో తప్పించుకున్నాం. మళ్లీ విశాఖ వస్తామని అనుకోలేదు. ఏపీ ప్రభుత్వం చొరవతో బయటపడ్డాం.. దారిలో మేం ప్రయాణిస్తున్న బస్సుపై కూడా దాడి జరిగింది. కర్రలు, రాడ్లతో బస్సును ధ్వంసం చేశారు. అక్కడి క్యాబ్ డ్రైవర్లు మాకు సహకరించారు. మూడు రోజులు హోటల్‌లోనే ఉండిపోయాం. మా హోటల్‌లోకి ఆందోళనకారులు చొరబడ్డారు. దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. తాము తిరిగి విశాఖ చేరుకోవడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని నేపాల్ నుంచి తిరిగివచ్చిన యాత్రికులు అనుభవాన్ని పంచుకున్నారు.
Next Story






