- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం.. వెల్లడించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు (Nellore) నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి (Potluri Sravanthi) మేయర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి (Potluri Sravanthi) మేయర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె రాజీనామాను ఇవాళ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆమోదించారు. గత కొన్ని రోజులుగా నెల్లూరు కార్పొరేషన్‌లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సి ఉండగా.. అంతకన్నా ముందే స్రవంతి తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో వివాదానికి తెర పడింది.
కాగా, నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉండగా, 2021 ఎన్నికల్లో అన్నీ వైసీపీ సొంతం అయ్యాయి. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత 42 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో అధికార పార్టీకి మెజారిటీ లభించింది. ఈ నేపథ్యంలోనే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. రాజీనామా తర్వాత నెల్లూరు ఇంచార్జ్ మేయర్‌గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ (Roop Kumar Yadav)కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అదేవిధగా కొత్త మేయర్ ఎన్నిక త్వరలోనే జరగనుంది.






