నెల్లూరుకు అందరూ రండి: పసుపు పండుగకు మంత్రి సాదర ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు' వేడుకలకు నెల్లూరు జిల్లా సిద్ధమవుతోంది. పార్టీ 44 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ గడ్డపై మహోత్సవం జరగనుంది....

నెల్లూరుకు అందరూ రండి: పసుపు పండుగకు మంత్రి సాదర ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు'(Mahanadu) వేడుకలకు నెల్లూరు జిల్లా(Nellore District) సిద్ధమవుతోంది. పార్టీ 44 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ గడ్డపై మహోత్సవం జరగనుంది. దీంతో నెల్లూరు జిల్లాలో పసుపు పండుగ జరగడం ప్రజలందరికీ గర్వకారణమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కొడవలూరు మండలం, కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగనున్న ఈ పసుపు పండుగకు తెలుగు తమ్ముళ్లందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నానని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేసేందుకు లక్షలాదిగా కదలిరావాలని కోరుతున్నానని తెలిపారు. మనందరి సమిష్టి కృషితో ఈ మహానాడును చిరస్మరణీయంగా మార్చుకుందామని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.

మంత్రి ఆనం ట్వీట్

Next Story