- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్‌లో ఎన్డీయే భారీ విజయం.. శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ విజయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రజలు స్పష్టమైన, దృఢమైన తీర్పు ఇచ్చారని, అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్న పరిపాలనకు ఈ ఫలితాలు పెద్ద మద్దతు అని ఆయన తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) ప్రతిపక్షానికి షాక్ ఇచ్చి ఏకంగా 200కు పైగా స్థానాల్లో మెజార్టీ లో దూసుకుపోతుంది. దీంతో బిహార్‌లో ఎన్డీయే కూటమి అధికారం ఖాయం అయింది. ఈ పలితాలపై కూటమిలోని పార్టీలు స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ విజయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. ప్రజలు స్పష్టమైన, దృఢమైన తీర్పు ఇచ్చారని, అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్న పరిపాలనకు ఈ ఫలితాలు పెద్ద మద్దతు అని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. NDA కూటమిలోని అన్ని పార్టీల నాయకులను ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్, BJP, JDU, లోక్ జనశక్తి పార్టీ నాయకత్వాలు ఈ భారీ విజయానికి అర్హులైన శుభాకాంక్షలు అందుకోవాలని అన్నారు. బీహార్ ప్రజలు అభివృద్ధి, శాంతి, మంచి పాలన కోసం ఓటు వేశారని, ఈ ఫలితం వారి ఆశయాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. జనసేన తరఫున NDA సారథ్యానికి పూర్తి మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.






