Narayana: ఇలానే జరిగితే ప్రభుత్వానికి అప్రతిష్టే.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

by Shiva |
Narayana: ఇలానే జరిగితే ప్రభుత్వానికి అప్రతిష్టే.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆ ఇష్యూ దేశాన్ని షేక్ చేశాయి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి (Vikunta Ekadasi) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం ఇచ్చే టోకెన్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇటీవల గోశాలలో గోవులు చనిపోయాయంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) టీటీడీ (TTD)పై సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే సీపీఐ నేత నారాయణ (Narayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల (Tirumala) పవిత్రతతో పాటు టీటీడీ (TTD) వ్యవస్థను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం (State Government)పై ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇలాంటి దేవాలయాలకు చెడ్డ పేరు వస్తే అది తిరుపతి (Tirupati) ప్రజానీకంతో పాటు సర్కార్‌కు అప్రతిష్టేనని కామెంట్ చేశారు. గోశాల (Gosala) దాణా విషయంలో అక్రమాలు జరిగితే.. ఖచ్చితంగా ఆ అంశంపై విచారణ జరిపించాల్సిందేనని తీసుకోవాల్సిందేనని అన్నారు. ఇలాంటి విషయాలను పెండింగ్‌లో పెడితే.. ప్రజల్లో అనుమానాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నారాయణ అన్నారు.

Next Story

Most Viewed