- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కడి నుంచి పోటీ చేసేది 48 గంటల్లో చెప్తా: MP RRR
ఎన్నికల్లో పోటీపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో పోటీపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. 48 గంటల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో తెలుస్తుందని అన్నారు. కచ్చితంగా ఈ సారి ఎన్నికల బరిలో ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. అయితే, అది అసెంబ్లీ బరిలో ఉంటానా? లోక్‌సభ బరిలో ఉంటానా? అనేది తెలియాల్సి ఉందని అన్నారు.
ఎక్కడ పోటీ చేసినా.. తాను పోటీ చేసే స్థానంలో ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించానని తెలిపారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాగా, చంద్రబాబు పాలకొల్లులో నిర్వహించిన సభలో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. ప్రజాగళం సభా వేదికపై రఘురామకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు. రఘురామను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రఘురామ బరిలో ఉంటారని తెలుస్తోంది.






