'మన్‌కీ బాత్'లో నరసాపురం లేస్ వైభవం.. ప్రధాని మోడీ ప్రశంసలపై సీఎం చంద్రబాబు హర్షం

by Malleboina Mahesh |

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 129వ 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసాపురం లేస్ (అల్లికల) హస్తకళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మన్‌కీ బాత్లో నరసాపురం లేస్ వైభవం.. ప్రధాని మోడీ ప్రశంసలపై సీఎం చంద్రబాబు హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 129వ 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసాపురం లేస్ (అల్లికల) హస్తకళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తరతరాలుగా మహిళలు ఓర్పుతో కాపాడుకుంటూ వస్తున్న ఈ కళ, నేడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం గర్వకారణమని ప్రధాని కొనియాడారు. ఈ కళకు 'జీఐ ట్యాగ్' (GI Tag) లభించడం, దాదాపు 250 గ్రామాల్లోని లక్ష మంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతూ 500 రకాల ఉత్పత్తులను తయారు చేయడం అభినందనీయమని మోడీ పేర్కొన్నారు. నరసాపురం లేస్ ఉత్పత్తుల ఎగుమతులు ఈ ఏడాది రూ. 150 కోట్లు దాటడం ఈ పరిశ్రమ పునర్వైభవానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు.

ప్రధాని ప్రశంసలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్‌లోని సౌందర్యాన్ని గుర్తించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సంప్రదాయ కళను కాపాడుతున్న మహిళల నైపుణ్యం, అంకితభావం అద్వితీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్ (NABARD) సహకారంతో ఈ కళాకారిణులకు కొత్త డిజైన్లలో శిక్షణ ఇస్తూ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ హస్తకళను మరింతగా ప్రోత్సహించి, కళాకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Next Story