- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైక్రోసాఫ్ట్, ఇన్ఫినియన్ కంపెనీలకు నారా లోకేష్ కీలక విజ్ఞప్తి
నాలుగు రోజుల సింగపూర్(Singapur) పర్యటనలో భాగంగా చివరి రోజైన బుధవారం మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మైక్రోసాఫ్ట్(Microsoft) సంస్థ ప్రతినిధులను కలిశారు.

దిశ, వెబ్ డెస్క్ : నాలుగు రోజుల సింగపూర్(Singapur) పర్యటనలో భాగంగా చివరి రోజైన బుధవారం మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మైక్రోసాఫ్ట్(Microsoft) సంస్థ ప్రతినిధులను కలిశారు. సింగపూర్ లోని సెసిల్ స్ట్రీట్ లో మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. సెంటర్ లోని ఏఐ గోస్టోర్ లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగ దృశ్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో సమావేశమయ్యి.. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ జోన్/టెక్నాలజీ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హ్యాకథాన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా సింగపూర్ లో ఇన్ఫినియన్(Infineon) సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్ఫియన్ ప్రెసిడెంట్ & ఎండి సిఎస్ చువాతో భేటీ అయ్యి.. ఏపీలో ఈఎంసిలు లేదా పారిశ్రామిక పార్కులలో సెమీ కండక్టర్స్ తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, BMS వ్యవస్థలను రూపొందించడానికి స్థానిక EV పర్యావరణ వ్యవస్థ ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.






