- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా పవన్ అన్న ఒరిజినల్ గాడ్’.. ఓజీకి నారా లోకేష్ విషెస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్ర(OG Movie) ప్రీమియర్స్ కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా పడబోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్ర(OG Movie) ప్రీమియర్స్ కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా పడబోతున్నాయి. ఈ క్రమంలో చిత్రబృందానికి ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) విషెస్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.. కానీ మా పవన్ అన్న మాత్రం అభిమానులకు ఒరిజినల్ గాడ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఎక్స్ వేదికగా నారా లోకేష్ పేర్కొన్నారు. డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తమిళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ అందించారు.






