- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ హస్తినకు నారా లోకేష్.. న్యాయవాదులతో సంప్రదింపులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి హస్తినకు చేరుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఈ నెల 8వ తేదీలోగా తీర్పు వచ్చే అవకాశముంది. అలాగే ఫైబర్ గిడ్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఈ నెల 8వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో కేసుల గురించి చర్చించేందుకు లోకేష్ ఢిల్లీకి వెళ్లారు.
చంద్రబాబు కేసుల గురించి న్యాయ నిపుణులతో లోకేష్ సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్న సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ నుంచి చంద్రబాబు విడుదల అయిన విషయం తెలిసిందే.
Next Story






