- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఢిల్లీకి నారా లోకేష్.. కారణం ఇదే!
నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు నారా లోకేష్. ఉదయం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు, టీడీపీ అగ్ర నాయకులు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు నారా లోకేష్. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో హస్తినాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం నేరుగా పార్లమెంట్ హౌస్ కు నారా లోకేష్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక అక్కడ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ లతో కీలక సమావేశం కూడా నిర్వహించనున్నారు లోకేష్.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేయబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలతో నారా లోకేష్ సమావేశం అయ్యే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఇవాళ రాత్రికి ఢిల్లీలో బస చేసి, మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్ కు తిరిగి బయలుదేరుతారు మంత్రి లోకేష్. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. కాగా మొన్నటి వరకు ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు విదేశాలకు నారా లోకేష్ వెళ్ళిన సంగతి తెలిసిందే.






