- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: ఆ మూడు అక్షరాలే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఎన్టీఆర్ (NTR) అనే మూడు అక్షరాలే తెలుగువారి అత్మగౌరవం కోసం తొడగొట్టాయని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ (NTR) అనే మూడు అక్షరాలే తెలుగువారి అత్మగౌరవం కోసం తొడగొట్టాయని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఇవాళ మంగళగిరి (Mangalagiri) జరగుతోన్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో సహా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం (Telugudesham) జెండాను చంద్రబాబు ఎగురువేశారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ.. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా.. ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఒక్క టీడీపీ (TDP)తోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.. మొదటి గెలుపు ఓ సంచలనం అని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు.. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారాయని అన్నారు.
ఇప్పటికీ పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయంటే అందు కారణం ఎన్టీఆరే అని కొనియాడారు. తెలుగోడి సత్తా.. ఏంటో ఢిల్లీకి చూపింది అన్న ఎన్టీఆర్ (NTR) అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని.. ఎంతమంది పత్యర్థులు మీదపడినా.. పసుపు సైన్యం మాత్రం పట్టు విడవకుండా పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘటన మహానేత ఎన్టీఆరే అని.. దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపింది చంద్రబాబేనని ప్రశంసించారు. మనకు గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసుంటూ చమత్కరించారు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్ర వేరని నారా లోకేశ్ అన్నారు.






