- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు జగన్.. ఆ విషయంలో నారా లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఎసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వెదికాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రచారంలో తాను అధికారం లోకి వచ్చిన తరువాత ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని.. హామీలు అన్నీ నెరవేర్చిన తరువాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఇదే విషయం పై నారా లోకేష్ స్పందించారు. హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నావ్.. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్. పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.






