- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh: ప్రత్యేక హోదా అన్నావ్.. ఏమైంది జగన్: నారా లోకేశ్ మాస్ ర్యాగింగ్
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ (Jagan) కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటూ ఊదరగొట్టాడని.. చివరికి ఏమైందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సెటైర్లు వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ (Jagan) కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటూ ఊదరగొట్టాడని.. చివరికి ఏమైందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సెటైర్లు వేశారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ (Governor) ప్రసంగానికి శాసన మండలి (Legislative Council)లో ధన్యవాదాలు తెలిపే క్రమంలో లోకేశ్ (LokesH) మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని ముందే ఎలా చెబుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి రూ.13 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని.. కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడంలో తప్పేముందని అన్నారు. పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరుగుతామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము ఎన్నికల ముందు టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు ఎన్డీఏకు మద్దతు తెలిపామని గుర్తు చేశారు. తాము కేంద్రం నుంచి పదవులు ఏమీ కోరలేదని.. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మాత్రమే అడిగామని కౌంటర్ ఇచ్చారు. కేవలం మాపైనే కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆధారపడినట్లు తాము చెప్పినట్లుగా వక్రీకరించడం కరెక్ట్ కాదని అన్నారు. ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనను చూసి తాము ముందుగానే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Government) వస్తుందని చెప్పామని నారా లోకేశ్ మండలిలో అన్నారు.






