ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సెల్యూట్ చేసిన నారా లోకేష్.. వీడియో వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-22 10:03:59  IST  )

ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సెల్యూట్ చేశారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సెల్యూట్ చేసిన నారా లోకేష్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సెల్యూట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పోస్టు కూడా పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ‘ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్‌ను నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(Constable Venkataratnam) స్పందించిన తీరుకు హాట్సాఫ్. చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ, థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి.. ఎంత గొప్పది! ఇంకెంత అమూల్యమైనది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో

Next Story