సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్ర‌బాబు, జ‌ర్న‌లిస్ట్ మూర్తికి సంబంధించిన ఓ ఏఏ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రూ.22వేలు పెట్టుబ‌డిగా పెట్టి డ‌బ్బులు సంపాదించండి అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చి సైబ‌ర్

సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్ర‌బాబు, జ‌ర్న‌లిస్ట్ మూర్తికి సంబంధించిన ఓ ఏఏ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రూ.22వేలు పెట్టుబ‌డిగా పెట్టి డ‌బ్బులు సంపాదించండి అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చి సైబ‌ర్ మోసానికి పాల్ప‌డుతున్నారు. కాగా ఈ వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు. జ‌ర్న‌లిస్ట్ మ‌రియు సీఎం చంద్ర‌బాబుపై నకిలీ ఏఐ వీడియో చూసి షాక్ అయ్యాన‌ని అన్నారు. ఇది పూర్తిగా మోసం అని ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని అన్నారు.

ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికి డీప్ ఫేక్ టెక్నాల‌జీని దుర్వినియోగం చేస్తే నేరస్థుల‌ను వ‌దిలిపెట్ట‌బోం అని హెచ్చ‌రించారు. అలాంటి సైబ‌ర్ నేర‌గాళ్ల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి మోసాల బారిన ప్ర‌జ‌లు ప‌డ‌వ‌ద్ద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇదిలా ఉంటే డీప్ ఫేక్‌తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. డీప్ ఫేక్ తో ఈ మధ్య సినిమా తారల వీడియోలను అశ్లీలంగా క్రియేట్ చేయడంతో సైబర్ నేరాలకు పాల్పడుతూ మోసం చేస్తున్నారు.

Next Story