నరహంతక వైసీపీని గద్దె దింపాల్సిందే: Nara Lokesh

by Malleboina Mahesh |   (  Updated:2023-02-22 09:23:47  IST  )

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డి మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

నరహంతక వైసీపీని గద్దె దింపాల్సిందే: Nara Lokesh
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డి మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కోబాక విడిది కేంద్రం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. బాలకోటి రెడ్డి హత్య మరో నెత్తుటి సాక్ష్యం అని చెప్పుకొచ్చారు.

నరహంతక వైసీపీని గద్దె దింపితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల కాల్పుల్లో గాయపడిన బాలకోటి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం విచారకరమన్నారు. బాలకోటి రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులకు లోకేశ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Next Story