ట్రోల్ చేసేవారిని పట్టించుకోను.. ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యం : Nara Lokesh

by Muthe.Rajitha |   (  Updated:2025-10-30 15:05:16  IST  )

సోషల్ మీడియాలో తమ పార్టీని ఎంత ట్రోల్ చేసినా పట్టించుకోబోమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసారు.

ట్రోల్ చేసేవారిని పట్టించుకోను.. ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యం : Nara Lokesh
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో తమ పార్టీని ఎంత ట్రోల్ చేసినా పట్టించుకోబోమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసారు. మొంథా తుఫాను అలెర్ట్ వ‌చ్చిన వెంట‌నే మా ప్రభుత్వం చేపట్టిన‌ సహాయకచర్యలను హేళ‌న చేస్తున్నారని.. ఇత‌ర రాష్ట్రాల్లో, ఇత‌ర దేశాల్లో ఉంటూ ప్ర‌తీ అంశాన్నీ ట్రోల్ చేసిన వారూ ఉన్నారని కాని వాటిని మేము పట్టించుకోమని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ మాకు ముఖ్యమని, ప్ర‌తీ మూగ‌జీవినీ కాపాడ‌ట‌మే తమ ల‌క్ష్యం అని తెలిపారు. అంతా క‌లిసి అవిశ్రాంతంగా ప‌నిచేశామని.. ధ‌న‌, జ‌న న‌ష్టం లేకుండా చూడ‌గ‌లిగాం అన్నారు. కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం ఎలచెట్లదిబ్బలో చిక్కుకుపోయిన గొర్రెల కాప‌రుల‌ను అధికార యంత్రాంగం సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చిందని పేర్కొన్న నారా లోకేష్.. న‌లుగురి ప్రాణాలు కాపాడిన బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

Next Story