Nara Lokesh: గుంటూరు జిల్లాలో నేడు మంత్రి లోకేష్‌ పర్యటన.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |

ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు వెళ్తున్నారు.

Nara Lokesh: గుంటూరు జిల్లాలో నేడు మంత్రి లోకేష్‌ పర్యటన.. అసలు విషయం ఇదే!
X

దిశ, వె‌బ్‌డెస్క్: ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ మంగళగిరి (Mangalagiri)లో అప్పట్లో లోకేశ్‌ (Lokesh)కు భారీ ఎత్తున విజ్ఞప్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో హామీల అమలును ఆయన మొదలు పెట్టారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ (Mangalagiri Constituency) పరిధిలోని తాడేపల్లి (Thadepally) మండలంలోని కొలనుకొండ, ఉండవల్లిచ, పెనుమాక, తాడేపల్లి పద్మశాలి బజారు, ఇప్పటం గ్రామాల్లో సర్కార్ భూముల్లో నివాసం ఉంటున్న దాదాపు 3 వేల మందికి ఇళ్లపట్టాలను అందజేశారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్ ఇవాళ గుంటూరు జిల్లా (Guntur District)లో పర్యటించనున్నారు. చిన్నకాకాని (Chinna Kakani)లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Next Story