పాఠశాల, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-05 16:59:17  IST  )

పాఠశాల, ఇంటర్ మరియు ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ ఏర్పాటుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

పాఠశాల, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: పాఠశాల, ఇంటర్ మరియు ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ ఏర్పాటుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. టీచర్ల బదిలీలు చట్టానికి అనుగుణంగా జరగాలని ఆదేశించారు. విద్యార్థుల పుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలని అధికారును ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన విదేశీ విద్య పథకానికి మార్గ దర్శకాలు రూపొందించాలని చెప్పారు. బాలికల కోసం తీసుకువచ్చిన కలలకు రెక్కలు పథకం గురించి అధికారులతో చర్చించారు. ఇదిలా ఉంటే రాబోయే విద్యా సంవత్సరం నుండి విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఏపీలో డీఎస్సీ నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రంలో కొత్త టీచ‌ర్లు వ‌స్తారు కాబట్టి స‌ర్కార్ స్కూళ్ల‌కు మ‌రిన్ని మెరుగులు దిద్దేలా కార్యాచ‌ర‌ణ చేస్తోంది.

Next Story