- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: WEF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో లోకేశ్ భేటీ.. కీలక ప్రతిపాదనలు!
ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇవాళ వలర్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ (Shyam Bishan)తో దావోస్ కాంగ్రెస్ సెంటర్ (Davos Congress Center)లో భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇవాళ వలర్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ (Shyam Bishan)తో దావోస్ కాంగ్రెస్ సెంటర్ (Davos Congress Center)లో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్‌తో అందరికీ ఆరోగ్యం అందించే విషయంలో వారి సహకారం కవాలని లోకేశ్ రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది తమ లక్ష్యమని.. హెల్త్ కేర్ డెలివరీ (Health Care Delivery)లో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని ఏఐ ఎనేబుల్ మెడికల్ హబ్ (AI enabled Medical Hub)లను ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టామని వివరించారు.
అదేవిధంగా యూనివర్సల్ వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ (Digital Health Profile) రూపొదించాలని అనుకుంటున్నామని శ్యామ్ బిషన్ (Shyam Bishan)కు తెలిపారు. ప్రపంచంలో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌గా ఏపీని నిలిపేలా టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు డబ్ల్యూఈఎఫ్ (WEF) తరపున సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కోరారు. క్యాన్సర్, డయాబిటిక్, రెటినోపతి వంటి వ్యాధల నిర్ధారణకు అల్గారిథమ్‌లలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయోగాలను టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలని లోకేశ్ శ్యామ్ బిషన్‌ను కోరారు.






