నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి.. అశోక్ గజపతిరాజుకు నారా లోకేష్ అభినందనలు

by Naga Rani Yarlagadda |

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ (Governor Ashok Gajapathiraju)గా నియమితులైన విషయం తెలిసిందే.

నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి.. అశోక్ గజపతిరాజుకు నారా లోకేష్ అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ (Governor Ashok Gajapathiraju)గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కూడా ఆయనకు అభినందనలు చెబుతూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

"గోవా గవర్నర్‌గా నియమితులైన పి. అశోక్ గజపతి రాజు గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయనకు ఈ గౌరవాన్ని ఇచ్చిన గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు. రాజు గారు తన నిజాయితీ, ప్రజా ప్రయోజనం పట్ల అత్యంత నిబద్ధతతో గవర్నర్ కార్యాలయానికి గొప్ప గౌరవాన్ని తెస్తారని నాకు నమ్మకం ఉంది." అని నారా లోకేష్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

https://x.com/naralokesh/status/1944695151525601488

Next Story