- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ఏపీ బ్యూరో: అబద్ధానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అచ్చం జగన్‌రెడ్డిలాగే ఉంటుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ మోసం చేయడమే సీఎం జగన్ నైజమని పేర్కొన్నారు. చంద్రబాబు 2018లోనే అంగన్‌వాడి టీచర్లు, ఆయాల జీతాలు పెంచారని గుర్తు చేశారు. అంగన్‌వాడి టీచర్ల జీతాన్ని రూ.7,500 నుంచి రూ. 10,500కు, ఆయాల జీతాన్ని రూ.4500 నుంచి రూ.6 వేలకు పెంచారని తెలిపారు. టీడీపీ ఘనతను జగన్ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మానుకోవాలని, ఎన్నికల్లో నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టమని లోకేష్ హితువు పలికారు.
Next Story






