- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌ను వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు తీసుకెళ్తా: మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్లడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వెళ్లడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తోందని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో విమాన టికెట్లు, మ్యాచ్ టికెట్లు కొని జల్సాలు చేశారని లోకేష్ పై విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన లోకేష్.. విమాన టికెట్ డబ్బులు, మ్యాచ్ టికెట్ డబ్బులు నా సొంత డబ్బులే అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా అంశంపై సోమవారం మరోసారి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. లోకేష్ చిట్‌చాట్ ద్వారా స్పందించారు. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2026)లో ఇండియా ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్(YS Jagan) వస్తానంటే ఆయనకు కూడా టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానన్నారు. నాకు దేశ భక్తి ఉంది, నేను వెళ్తా అని చెప్పుకొచ్చారు. అలాగే హెరిటేజ్ విషయంపై కూడా స్పష్టత ఇచ్చారు. హెరిటేజ్‌కు ఇందపూర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.






